మే నెలలో పండుగలు

2 తేది: అన్నవరం సత్యదేవుని కళ్యాణం

15 తేది: హనుమజ్జయంతి

16 తేది: రేవా నదీ పుష్కర ప్రారంభం

19 తేది: మాసశివరాత్రి


గీతాయాః పుస్తకం యత్ర
యత్ర పాఠః ప్రవర్తతే,
తత్ర సర్వాణి తీర్థాని
ప్రయాగాదీని తత్రవై. (భగవద్గీత)


తా:ఎచట గీతాగ్రంథముండునో, మఱియు ఎచట గీత పారాయణ మొనర్పబడుచుండునో, అచట ప్రయాగ మొదలగు సమస్తతీర్థములున్ను ఉండును.

****************************************************************************************

ఉ. ఎట్టుగఁ బాటుపడ్డ నొకయించుక ప్రాప్తము లేక వస్తువుల్‌
పట్టువడంగ నేరవు నిబద్ధిత సురావళిఁ గూడి రాక్షసుల్‌
గట్టు పెకల్చిపాల్కడలిఁ గవ్వము చేసి మథించి రంతయున్‌
వెట్టియె కాక యే మనుభవించిరి వా రమృతంబు భాస్కరా. (భాస్కర శతకము)


తా: మనుజుడెంత పాటుపడినను పూర్వపుణ్యఫలము లేనిది ఏమియు దొరకదు. రాక్షసులు దేవతలతో గూడి యమృతమందిలియాశచే మందర పర్వతమును పెల్లగించి తెచ్చి సముద్రమును తరిచి కూలిలేని చాకిరి చేసిరే కాని ఫల మేమైన ననుభవింపగలిగారా?.

****************************************************************************************

ఆ|వె| కర్మ మెప్పుడైనఁ గడచిపోవగరాదు
ధర్మరాజుఁదెచ్చి తగని చోటఁ
గంకు భట్టుఁజేసెఁగట కటా దైవంబు
విశ్వదాభిరామ వినురవేమ! (వేమన శతకము)


తా: మనుజుడు తాను చేసికొన్న కర్మముల ఫలము నెప్పుడైనను అనుభవించి తీరవలసినదే. అది తప్పించుకొనుటకు శక్యముకాదు. ధర్మరాజును దెచ్చి అతని కర్మఫలమనుభవించుటకై దైవము అతని కంటె అల్పుడైన విరాటరాజు దగ్గర సేవచేయుటకు కంకుభట్టుగా నిలిపినాడు గదా!.

****************************************************************************************